మహేష్ బాబు తో విబేధాలు.. ఆ రోజు ఏం జరిగిందంటే.. డైరెక్టర్ పరశురామ్‌

BY T20,

'గీత గోవిందం' సినిమాతో సక్సెస్ దక్కించుకున్న పరశురామ్‌ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమా తీయడం గురించి దాదాపు అందరికి తెలిసిన విషయమే.

ఈ సినిమా ఈ నెల 12 న విడుదలకానుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడుతుందని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం ఇటీవల విడుదలైన ట్రైలర్ అనే చెప్పాలి.

ఈ సమయంలో దర్శకుడు పరశురామ్‌ ఒక వార్తా పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించాడు. ఇంతకు ముందు మహేష్‌బాబు, పరశురామ్‌ల మధ్య విభేదాలు వచ్చాయని టాక్ వచ్చింది. అయితే ఇది రూమర్ కాదని క్షణికావేశంలో జరిగిన కొన్ని వైరుద్యాలనీ చెప్పుకొచ్చారు. సాధారణంగా పెద్ద సినిమాలు చేసేటప్పుడు ఇవన్నీ సాధారణం అని కూడా చెప్పారు.

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మహేష్ బాబు ఈ స్క్రిప్ట్‌ను మూడేళ్లపాటు మోసుకెళ్లాల్సి వచ్చింది, ఇది చాలా కష్టమైన విషయమే, ఇలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు అసహ్యం వ్యక్తం చేసినప్పటికీ, అతను నన్ను తన సోదరుడిలా చూసుకున్నాడని పరశురామ్ అన్నారు.

ఇది మాత్రమే కాకుండా.. షూట్ సమయంలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు తలెత్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్ ప్లాన్ చేసినప్పటికీ, దానిని కాస్త రామోజీ ఫిల్మ్ సిటీకి మార్చాము. అది కూడా కొంత చికాకును కలిగించింది. మొత్తం మీద మహేష్ బాబుకు తనకు బేదాభిప్రాయాలు లేవని అన్నారు.

దీనితో పాటు మహేష్ బాబు గారు కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని, సినిమా షూటింగ్ కంటే కూడా అత్యధికంగా కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పారు. మహేష్ బాబు హాలిడే ట్రిప్ ల వల్లే సర్కారు వారి పాట షూటింగ్ కాస్త ఆలస్యం అయింది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు ని తిట్టాడా లేదా పొగిడాడా అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

Scroll to Top