ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే మీ ఫోన్ పేలడం గ్యారెంటీ..!

BY T20,

ప్రస్తుతం వున్న గ్లోబల్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరికి సెల్ ఫోన్ వాడకం తప్పనిసరి. చిన్న పిల్లల నుండి పండు ముసలివరకు సెల్ ఫోన్ లేకుంటే ఎవ్వరికి పూట గడవదు.

2010 కంటే ముందు ఫోన్స్ వాడకం కాస్త తక్కువగానే వున్నప్పటికి ఆ తర్వాత వీటిని వాడకం అధికం అయింది. చైనా ఫోన్స్, కొరియా ఫోన్స్ అంటూ తక్కువ ధరలకే ఫోన్స్ అందుబాటులో ఉండడం వల్ల సామాన్యుల చేతిలో కూడా ఫోన్ వుంటుంది. కొందరైతే ఫోన్ చూస్తూనే భోజనం చేయడం లాంటి అలవాట్లకు గురయ్యారు.

కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ దాదాపు రెండు సంవత్సరాలు పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లకుండా అన్ లైన్ లోనే క్లాసులు వింటూ వచ్చారు. ఆ క్లాస్ లు వినడానికి అవసరమైన సాధనం ఫోన్ మాత్రమే. ఫోన్ తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు అప్పుచేసి మరీ పిల్లలకు ఫోన్ కొనిచ్చారు. ఇంతవరకు బాగానే వున్న వాటిని వాడడంలో మాత్రం ఏ మాత్రం ఏమరుపాటుగా వున్న మీ చేతిలో ఫోన్ పేలిపోడానికి ఆస్కారం ఉందని సైబర్ ఎక్స్పర్ట్ చెబుతున్నారు.

ఫోన్ బాగా వాడేవారు తమ సెల్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందని ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కే ఛార్జర్ ను కొంటున్నారు. 2 ఏళ్ళ క్రితం ఇలాంటి పరిస్థితులు లేకపోయినా ఇప్పుడు మాత్రం వివిధ కంపెనీలు ఫాస్ట్ ఛార్జింగ్ లను అమ్ముతున్నాయి. ఇందులో చాలా మోడల్స్ అందుబాటులోకి తెచ్చాయి కూడా. కొన్నాళ్ళ క్రితం నుండి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లు హ్యాండ్ సెట్ కు ఫాస్ట్ ఛార్జింగ్ జోడించి అమ్ముతున్నాయి. ఇప్పుడు వినియోగదారులు మెట్రో లైఫ్ స్టైల్ లో ర్యాపిడ్ ఛార్జర్స్ ను కోరుకుంటున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైందిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్ని స్మార్ట్ ఫోన్స్ అన్ని ఫాస్ట్ ఛార్జర్లకు సపోర్ట్ చేయవు వాటికి వేరే పరిమితులు ఉంటాయి. సాంసంగ్ ఫోన్స్ లో 18 వాట్స్ లేదా 25 వాట్స్ మాత్రమే అందుబాటులో వుంది. రియల్ మీ ఫోన్స్ మాత్రం 18,33,67 వాట్స్ తో పాటు తాజాగా 150 వాట్స్ అందుబాటులోకి తెచ్చింది. వీటి వల్ల ఫోన్స్ తొందరగా రిపేర్ వస్తున్నాయి. డెడ్ కావడం, ఫోన్ అన్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోవడం జరుగుతుంది.

ఫోన్ తొందరగా ఛార్జింగ్ కావాలని ఫాస్ట్ ఛార్జర్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆ ఛార్జర్ ఆ ఫోన్ సపోర్ట్ చేయదు దీంతో చాలా మంది టైప్ సీ ఛార్జింగ్ తో కూడిన ల్యాప్ టాప్ ఛార్జర్ ను వినియోగిస్తున్నారు అలా చేయడం వల్ల ఫోన్ కు హాని జరిగుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఒక్కోసారి దీని వల్ల మదర్ బోర్డ్ లో ప్రాబ్లమ్ వచ్చి ఫోన్ పేలిపోయే పరిస్థితి వుంది. కావునా ఫోన్ కొన్నప్పుడు కంపెనీ తో పాటు ఇచ్చే ఛార్జర్ ను మాత్రమే వాడడం మంచిది లేదంటే ఫోన్ పేలిపోవడం,హీట్ కావడం,డెడ్ అవ్వడం,హ్యాంగ్ అవ్వడం, సడెన్ గా స్విచ్ ఆఫ్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి.

Scroll to Top