Prabhas: ప్రభాస్ అంటే పడి చచ్చిపోతున్న ఫ్యాన్.. నిజంగానే చస్తానంటూ సూసైడ్ లెటర్!

BY T20,

సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉండటం కామన్. వాళ్లు ఎక్కడకు వెళ్లినా.. వందలాదిగా అభిమానులు తరలివస్తుంటారు. తమ అభిమాన హీరోతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడుతుంటారు.

స్టార్ హీరోలకు అయితే.. వేలల్లో లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అదే అభిమానం వారికి చిన్న చితకా తలనొప్పులు కూడా తెచ్చిపెడుతుంటుంది. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌(Prabhas) కు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. ప్రభాస్‌ (Prabhas)ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ బాహుబలికి(Bahubali) అటు అమ్మాయల్లోను.. ఇటు అబ్బాయిల్లోను కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ అంటే పడి చచ్చే అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటివారిలో ఓ పిచ్చి ఫ్యాన్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ లెటర్ రాశాడు.

వివరాల్లోకి వెళ్తే... ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో సలార్(Salaar) సినిమాలో ప్రభాస్ననటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది. అప్పటికే లైన్ లో మరో సినిమా ఉండటంతో సినిమా షూటింగులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేయలేదు మేకర్స్. దాంతో అభిమానులు నిరాశ చెందినట్లు కనిపించారు.ఒక అభిమాని మాత్రం నేరుగా డైరెక్టర్ కు సూసైడ్ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఆ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సలార్ సినిమా కు సంబంధించిన గ్లింప్స్ ను మే నెలలో విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గురించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. మరి ఈ విషయం గురించి ప్రభాస్ ఏమని స్పందిస్తాడో చూడాలి.

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బిజీగా ఉన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే రాధే శ్యామ్ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రభాస్ .. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్‌లో(Salaar) నటిస్తున్న విషయం తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా మారుతుందనే టాక్ వినిపిస్తూ వస్తుంది. అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతి బాబు మరోసారి రఫ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవగా.. సలార్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రాజెక్ట్ కే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్,దీపికా పదుకొణె,దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Scroll to Top