విశ్వక్‌లా కాదు.. ఆమెకు నాలుగు తగిలించేవాడినన్న డైరెక్టర్.. పూర్తి మద్దతు ప్రకటించిన రాహుల్ రామకృష్ణ

BY T20,

విశ్వక్ సేన్, ప్రముఖ యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయగా మొదలైన రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ విషయం మీద కొందరు నాగవల్లికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం విస్వాక్ సేన్ కు సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా విశ్వక్ సేన్ కు మద్దతుగా రాహుల్ రామకృష్ణ, బండి సరోజ్ కుమార్ కామెంట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

అశోక వనంలో అర్జున కళ్యాణం

విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింతా అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. మే 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా మీద జనాల్లో ఆసక్తి పెంచేదుకు ప్రసాద్ ఐమాక్స్ వద్ద సినిమా చూసి రివ్యూలను తనదైన శైలిలో చెప్పి పేరు తెచ్చుకున్న లక్ష్మణ్ అనే వ్యక్తితో ఒక ప్రాంక్ ప్లాన్ చేసింది.

ఛానల్ లో డిబేట్

ఆ ఫ్రాంక్ ప్రకారం సదరు లక్ష్మణ్ విశ్వక్ సేన్ వెళుతున్న కారుకు అడ్డం పడి అల్లం అర్జున్ కుమార్ ను ఇప్పుడే కలవాలని లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటా అని హడావిడి సృష్టించాలి. అలా హడావుడి సృష్టించే సమయంలో విశ్వక్ సేన్ అతనిని సముదాయించి అక్కడి నుంచి పంపించాలి. అంతా బాగానే ఉంది కానీ ఈ వీడియో వైరల్ అవడంతో దేవీ నాగవల్లి తాను పని చేస్తున్న ఛానల్ లో డిబేట్ పెట్టింది.

ఎఫ్ పదంతో

స్టూడియోకి విశ్వక్ వెళ్లి దేవి నాగవల్లితో మాట్లాడటం ఆ మాటలు శ్రుతి మించడంతో వాగ్వాదం జరిగింది. విశ్వక్ ను పాగల్ సేన్, డిప్రెస్డ్ పర్సన్ అంటూ దేవి మాట్లాడడంతో ఆ మాటలు మీరు మాట్లాడవద్దు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటూ అన్నందుకు దేవి గెట్ అవుట్ అనింది. దీంతో అవమానంగా భావించిన విశ్వక్ ఎఫ్ పదంతో వచ్చే పరుష పదజాలం వాడాడు. ఇక ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

హీరోయిన్ కస్తూరి మద్దతు

ఈ క్రమంలో ఇరువురి కోసం మద్దతు ఇస్తూ చాలా. మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు విశ్వక్ కి మద్దతుగా నిలిచి దేవి నాగవల్లిని ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా విశ్వక్ కు మద్దతుగా సీనియర్ హీరోయిన్ కస్తూరి వీడియో చూసాక నీపై గౌరవం పెరిగిందని ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా తన మద్దతు తెలిపారు.

రాహుల్ రామకృష్ణ సైతం

సదరు ఛానల్ నీచ స్వభావాన్ని ఎవరూ ప్రస్తావించరు, మాకు వార్తలను చూపడం పరంగా వారు శ్రద్ధ వహిస్తారని కలరింగ్ ఇస్తారు కానీ , వారు నిజంగా దాని గురించి పట్టించుకోరు, వారికి మంచి నిధులు వస్తాయి. విశ్వక్‌సేన్‌ వంటి నిరాడంబరమైన వ్యక్తిని చుట్టుముట్టి, అవమానపరిచే సర్కస్‌లో నేను భాగం కావాలనుకుంటున్నాను, అతనికి నా పూర్తి మద్దతు ఉంది అంటూ ట్వీట్ చేశాడు.

నేనైతే నాలుగు తగిలించేవాడ్నిఅంటూ

ఇదిలా ఉంటే యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ పరోక్షంగా స్పందిస్తూ.. 'వాడు మంచోడు కాబట్టి.. F***తో సరిపెట్టాడు. నేనైతే నాలుగు తగిలించేవాడ్ని.. నా నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డ్స్‌కి ఏ మాత్రం అతీతం కాదు.. ఫస్ట్ హ్యూమన్(మనిషి)' అంటూ యాంకర్ దేవికి ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ ఇస్తూ విశ్వక్ ను సపోర్ట్ చేశారు. నిర్భంధం, నిర్భధం 2 చిత్రాలతో పేరు సంపాదించుకున్న బండి సరోజ్ కుమార్ తెరకెక్కించిన సూర్యాస్తమయం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Scroll to Top