రాజమౌళిని ఢీకొట్టేవాడు వచ్చేశాడా..?

BY T20,

'కెజిఎఫ్2' విడుదలయినప్పటి నుంచి ప్రశాంత్‌ నీల్‌ పేరు మారుమోగిపోతోంది. ఫిల్మ్‌ మేకర్స్‌ దగ్గర నుంచి మొదలుపెడితే, మార్కెట్‌ అనలిస్టుల వరకు అంతా ప్రశాంత్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.. కొంతమందైతే ప్రశాంత్‌ నీల్‌కి స్టార్లు అవసరం లేదు, ఆ మాటకొస్తే హీరోలతో కూడా పనిలేదు. బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో సిలౌట్స్‌ని పెట్టి కూడా సినిమాలు తీసెయ్యగలడనే కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. రాజమౌళిని కూడా మించిపోతాడని అంటున్నారు. కన్నడ సినిమాలకి కన్నడలో తప్ప మరో భాషలో పెద్దగా మార్కెట్‌ లేదు. మళయాళ సినిమాలు అయినా అప్పుడప్పుడు తెలుగులో డబ్‌ అవుతుంటాయి గానీ, కన్నడ సినిమాలని డబ్‌ చేయాలని ఎవరూ ఆసక్తి చూపించరు. ఇలాంటి పరిస్థితుల్లో కన్నడ సినిమాకి లార్జ్‌ స్కేల్‌ మార్కెట్‌ తీసుకొచ్చింది 'కెజిఎఫ్'. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర సెన్సేషన్ సృష్టించింది.

'ఆర్ ఆర్ ఆర్' విడుదలయిన మూడు వారాల గ్యాప్‌తో జనాల ముందుకొచ్చింది 'కెజిఎఫ్2'. ఇక రెండు సినిమాలు షార్ట్ గ్యాప్‌లో విడుదల కావడంతో కంపారిజన్స్‌ మొదలయ్యాయి. హిందీనాట 'కెజిఎఫ్2' మూడు రోజుల్లోనే వందకోట్ల మార్క్‌ దాటితే, 'ఆర్ ఆర్ ఆర్' వందకోట్ల మార్క్‌ రీచ్‌ కావడానికి 5 రోజులు పట్టింది. రాజమౌళి సినిమా కంటే ప్రశాంత్‌ నీల్ సినిమాకే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా భారీగా ఉన్నాయి. సో జక్కన్నకి ప్రశాంత్‌ నీల్‌ పోటీగా మారుతున్నాడనే కామెంట్స్‌ వస్తున్నాయి. 'కెజిఎఫ్-1' సినిమాకి తెలుగునాట భారీ క్రేజ్‌ రావడానికి రాజమౌళి మెయిన్‌ రీజన్‌ అని చెప్పాలి. 'కెజిఎఫ్-1' విజువల్స్‌ చూసి, రాజమౌళియే స్వయంగా ఈ సినిమాని ప్రమోట్‌ చేశాడు. 'కెజిఎఫ్-1'కి తెలుగునాట పాజిటివ్‌ బజ్‌ వచ్చింది. ఇప్పుడు 'కెజిఎఫ్' ఒక బ్రాండ్‌గా మారింది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌గా మారాడు.

'రోబో' వరకు శంకర్‌ సినిమా అంటే ఒక బ్రాండ్‌. భారీ సినిమాలతో మెస్మరైజ్‌ చేస్తాడనే పేరుంది. అయితే 'ఐ' సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ రావడం, 'రోబో' సీక్వెల్ 'టు పాయింట్‌ ఓ' ఫ్లాప్‌ అవడంతో శంకర్‌ అన్‌బీటబుల్‌ సక్సెస్‌ జర్నీలో కుదుపు వచ్చింది. లైకా 'ఇండియన్2' ఇష్యూతో శంకర్‌ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఓ బ్లాక్‌బస్టర్‌తో నెగటివిటీని బ్రేక్‌ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే తీశాడు. అందులో 'కెజిఎఫ్' ప్రాంచైజీ నుంచి 2 సినిమాలు వచ్చాయి. డెబ్యూ మూవీ 'ఉగ్రమ్' కూడా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గానే వచ్చింది. ఇక ప్రశాంత్‌ నీల్‌ యాక్షన్‌ సినిమాలు తప్ప మరో జానర్‌లో సినిమాలు తీయలేదు. దీంతో ప్రశాంత్ రెగ్యులర్‌గా యాక్షన్‌ సినిమాలే చేస్తే, రొటీన్‌ సినిమాలు తీస్తాడనే నెగటివ్‌ ఇమేజ్‌ వస్తుంది. సో కొత్త జానర్‌ ట్రై చేసి, అక్కడ కూడా బ్లాక్‌ బస్టర్‌ కొడితే ప్రశాంత్‌ నీల్‌ ఇండియన్‌ టాప్‌ డైరెక్టర్స్‌ లీగ్‌లో టఫ్‌ కాంపిటీటర్‌గా మారే అవకాశముంది.

Scroll to Top