`రామ్ సేతు` 1000 కోట్ల క్లబ్ హీరోని చేస్తుందా?

BY T20,

అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం `రామ్ సేతు`. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - సత్యదేవ్ - నుష్రత్ భరుచ్చా తదితరులు నటిస్తున్నారు. పురాణేతిహాసం రామాయణ కథలో రామసేతు నిర్మాణం ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలుసు. రామసేతు చుట్టూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ఇప్పుడు పెద్ద తెరకెక్కించారు. రామసేతు  నిజమైన ఉనికిని చూసేందుకు కాలానికి వ్యతిరేకంగా రేసులో ఉండే యువకుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు.

తాజాగా అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో `రామ్ సేతు` ప్రపంచం గురించి విజువల్ గ్లింప్స్ ని పంచుకున్నాడు. మూవీని ఈ దీపావళికి థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది సరైన సమయం అని దాని సబ్జెక్ట్ ప్రకారం డేట్ ఫిక్స్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.


 
 
 

అక్షయ్ షేర్ చేసిన కొత్త స్టిల్ లో అతను ఫైర్ లైట్ పట్టుకుని చీకటి గుహలో ఏదో ఆసక్తిగా వెతుకుతూ కనిపించారు. జాక్వెలిన్ - సత్యదేవ్ అతని పక్కన నిలబడి ఉన్నారు. తారలంతా ఎంతో విస్మయంగా ఆశ్చర్యపోతూ ఏదో రహస్యాన్ని కనిపెట్టిన వారిగా కనిపిస్తున్నారు.

ఈ స్టిల్ ను షేర్ చేస్తూ అక్షయ్ తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చాడు. #రామసేతు ప్రపంచంలోకి ఒక ప్రయాణమిది. సినిమా థియేటర్లలోకి దీపావళి 2022 కానుకగా వస్తున్నాం.. అని వెల్లడించారు.  కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్- అబుదాంటియా ఎంటర్ టైన్ మెంట్ - అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి అక్షయ్ నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ -దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేదిని కూడా కిలాడీ కుమార్ ట్యాగ్ చేశాడు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత విక్రమ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ''రామసేతు సినిమా ఇంతకు ముందు ఏ దేశం చూడని యాక్షన్ అడ్వెంచర్. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో 240 దేశాలలో అందుబాటులో ఉంటుంది.

`రామ్ సేతు`ను పూర్తి స్థాయి యాక్షన్-అడ్వెంచర్ ఎంటర్ టైనర్ అని ఆయన అభివర్ణించారు. ప్రజలను తిరిగి థియేటర్లలోకి తీసుకురావడానికి ఇది ఖచ్చితంగా విభిన్నమైన విజువల్ ఫీస్ట్ అవుతుంది అని తెలిపారు. నేను కంటెంట్ వివరాలను బహిర్గతం చేయలేను కానీ ఇది సాంప్రదాయ భారతీయ చలనచిత్ర విలువలను .. వినోద విలువలను ప్రగతిశీల ఆలోచనలతో సమతుల్యం చేసే చిత్రం.

ఇది ఒక అద్భుత కథాంశంతో తెరకెక్కుతోంది. దీని కోసం ప్రజలు థియేటర్లలోకి రావాలని విజ్ఞప్తి చేస్తారు. ఇటీవల పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ని దండెత్తుతున్నాయి. అక్షయ్ నటించిన రామ్ సేతు కూడా అదే కేటగిరీలో విడుదలై పెద్ద విజయం అందుకుంటుందేమో చూడాలి. 1000 కోట్ల క్లబ్ లో చేరకపోతే అతడు ప్రభాస్ - యష్ తరహాలో పాన్ ఇండియా స్టార్ కాలేకపోయాడనే భావించాలి.

Scroll to Top