సౌత్ దెబ్బతో… 2 నెలల్లోనే 3 వేల కోట్లు

BY T20,

చైనా నుండి ఊడిపడిన మహమ్మారి కరోనా ప్రపంచ దేశాలను గజ గజ వణికించింది ఇప్పటికీ ఈ ప్రపంచాన్ని పూర్తిగా వీడకుండా ఆందోళన చెందేలా చేస్తోంది. ఈ మాయదారి వైరస్ కారణంగా రెండేళ్ల పాటు పూర్తిగా ప్రపంచమే మాస్క్ వేసుకోవాల్సి వచ్చింది, ఎక్కడి వారు అక్కడ లాక్ అయిపోయారు.

మొదటి సారిగా నెలల తరబడి వాహనాలు మూలన పడ్డాయి. వ్యాపార సంస్థలు ఇలా ఒకటి రెండు కాదు అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. వీటితో పాటుగా సినీ రంగం కూడా ఘోరంగా దెబ్బతింది. సినిమాలు లేక, సినీ కార్మికులకు పనిలేక, షూటింగ్స్ ఆగిపోయి నష్టాలు, థియేటర్లు మూతపడటం ఇలా అన్నివిధాలుగా సినీ పరిశ్రమ ఆర్దికంగా పతనమైన విషయం విదితమే. అయితే కొంత కాలానికి కరోనా కాస్త శాంతిచడంతో మళ్ళీ పరిస్థితులు మునపటిలా మారాయి. అలాగే ఇండస్ట్రీ కూడా తిరిగి మునుపటిలా బిజీ అయిపోయింది.

అయితే కరోనా కారణంగా సినీ పరిశ్రమకు వచ్చిన వేలాది కోట్ల నష్టాలు ఇప్పట్లో భర్తీ కావని అంచనా వేశారు పలువురు సినీ విశ్లేషకులు, దిగ్గజాలు. ఏదైన మిరాకిల్స్ జరిగితే తప్ప ఇప్పట్లో మళ్ళీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్వ వైభవాన్ని పొందదని అంతా అనుకున్నారు. అయితే ఇంతలోనే నిజంగానే అద్భుతాలు జరిగి భారత సినీ ఇండస్ట్రీ పూర్వ వైభవంతో కళకళ లాడుతోంది పలు చిత్రాలు సంచలన విజయాలు సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంతో సినీ పరిశ్రమ భారీ లాభాలను అందుకుని కరోనా మిగిల్చిన నష్టాల నుండి తేరుకుంది. కరోనా వ్యాప్తి తగ్గడంతో గడిచిన ఈ నాలుగు నెలల్లో చాలా సినిమాలు వరుసగా థియేటర్ల లోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల అయిన పలు సౌత్ ఇండియన్ చిత్రాలు ఆల్ ఇండియా వైడ్ 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.ఈ రెండు నెలల్లో ఇండస్ట్రీలో భారీ బిజినెస్ జరిగిందని అందువలనే ఇండస్ట్రీ ఇంత త్వరగా కరోనా నష్టాల నుంచి తేరుకోవడమే కాకుండా మళ్ళీ లాభాల బాట పట్టిందని చెబుతున్నారు. ఇక ఈ రేంజ్ లో మార్కెట్ లో బిజినెస్ చేసి వండర్స్ క్రియేట్ చేసిన ఆ సినిమాలు ఏవి అంటే.. దక్షిణాది నుండి వచ్చిన సినిమాలలో ఆర్ ఆర్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ చాప్టర్ 2, రాదే శ్యామ్ తో పాటు నార్త్ చిత్రాలు అయిన 'కాశ్మీర్ ఫైల్స్' 'గంగూబాయి కతీయవాడి' లు కూడా ఉన్నాయి. కాగా ఇవన్నీ కలిపి దాదాపు 3000 కోట్లకు పైగా మెగా బిజినెస్ చేసి ఇండస్ట్రీని కరోనా నష్టాల నుండి కాపాడాయి అని చెబుతున్నారు. అయితే వీటిలో దక్షిణాది చిత్రాలదే పై చేయి అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పై సౌత్ ఇండియన్ చిత్రాలు దండెత్తి ఎక్కువ వాటాతో కాసులను ఇటు పక్కకు చేర్చాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్...వీటిలో ట్రిపుల్ ఆర్ , కేజీఎఫ్ చిత్రాల కలెక్షన్లు ఏకంగా 2200 కోట్లకు పైగా ఉండటం విశేషం.

Scroll to Top