నేనేం చేతగానిదాన్ని కాదు.. లిమిట్స్ క్రాస్ చెయ్యకు జాగ్రత్త.. సమంత సంచలన వ్యాఖ్యలు..!

BY T20,

సమంత మరోసారో సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది. నాగ చైతన్యతో విడాకుల తరువాత సామ్ ప్రతి వ్యాఖ్య హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. దాంతో సమంత ప్రతి మూమెంట్ పై సోషల్ మీడియా ఫోకస్ పెట్టింది. దాంతో తన క్రేజ్ కి తగ్గట్టే సామ్ కూడా తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా సమంత చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నేను కామ్ గా ఉన్నానని తక్కువ అంచనా వేయొద్దు.. నేను అజ్ఞానురాలిని అని ఫీల్ అవ్వొద్దు.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది జాగ్రత్త అంటూ సమంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే మొన్న విడాకులకు తానే కారణమని విమర్శించిన వారిని కోర్టుకి లాగి మరి గట్టి కౌంటర్ ఇచ్చిన సమంత మరోసారి అలాంటి పదునైన మాటలు మాట్లాడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో సమంత మాట్లాడుతూ ” “నా మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దు. నేను సైలెంట్‌గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అనుకోవద్దు. నా దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది” అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అయితే సామ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Scroll to Top