‘సర్కారు వారి పాట’ టాక్‌ ఎలా ఉందంటే..

BY T20,

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా, 'గీత గోవిందం'ఫేమ్‌ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారి పాట'.

కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్‌ ఇచ్చాడు పరశురాం. ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్‌ పాటలు ఎంత సూపర్‌ హిట్‌ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 'సర్కారు వారి పాట' కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు 'సాక్షి' బాధ్యత వహించదు.

మహేశ్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్‌ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. ఫస్టాఫ్‌తో పాటు కొన్ని ఫైట్స్‌ సీన్స్‌కి తమన్‌ బీజీఎం అంతగా వర్కౌట్‌ కాలేదు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

Scroll to Top