‘సర్కారు వారి పాట’ ట్రైలర్: మహేష్ మెంటల్ మాస్ స్వాగ్..!

BY T20,

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేయబడిన 'సర్కారు వారి పాట' ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఈ క్రమంలో అభిమానులను మరింత ఉత్సాహ పరచడానికి చిత్ర బృందం ఈరోజు సోమవారం ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

హైదరాబాద్ లో మాస్ థియేటర్ గా పేరుగాంచిన కూకట్ పల్లి భ్రమరాంబ 70 ఎంఎంలో భారీగా తరలివచ్చిన సూపర్ స్టార్ అభిమానుల సమక్షంలో 'సర్కారు వారి పాట' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్.

ట్రైలర్ విషయానికొస్తే.. ముందు నుంచీ చెప్తున్నట్లుగానే 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు సరికొత్త అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నారు. వింటేజ్ మహేష్ ను గుర్తుకు తెచ్చేలా క్యారెక్టరైజేషన్ ను డిఫరెంట్ గా డిజైన్ చేశారు దర్శకుడు పరశురాం.

హై వోల్టేజ్ యాక్షన్ తో మహేష్ బాబు మాస్ స్వాగ్ ను ఎలివేట్ చేసేలా కట్ చేయబడిన SVP ట్రైలర్ అభిమానులు విపరీతంగా అలరిస్తోంది. ఇదొక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలియజేస్తోంది. 'పోకిరి' రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - సినిమాటోగ్రాఫర్ ఆర్. మది విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఇందులో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని - సుబ్బరాజు - వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేశారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ కు.. SVP ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Scroll to Top