‘సర్కారు వారి పాట’ బాగానే ఉన్నా.. అవే పెద్ద మైనస్‌

BY T20,

మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూవర్స్ నుండి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్యంగా మహేష్‌ బాబు అభిమానులకు కన్నుల పండుగ.. మాస్ జాతర అంటూ రివ్యూలు వచ్చాయి. అయితే సెకండ్‌ హాఫ్‌ లో సినిమా విషయంలో దర్శకుడు పట్టు కోల్పోయి సో సో గా సాగించేశాడు. మహేష్ బాబు పాత్ర డిజైన్ విషయంలో పెట్టిన శ్రద్ద కథ స్క్రీన్ ప్లే విషయంలో పెట్టలేదు అంటూ రివ్యూల్లో చెప్పుకొచ్చారు. 

ఈ సమయంలో సోషల్‌ మీడియాలో కొందరు మహేష్ బాబుకు వ్యతిరేకంగా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సినిమా ఓవరాల్‌ గా బాగానే ఉన్నా కూడా యాంటీ ఫ్యాన్స్ బ్యాడ్‌ పబ్లిసిటీ చేస్తున్నారు.

#ad1

ఆచార్య తో పోల్చుతు కొందరు.. పుష్ప తో పోల్చుతూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్‌ మీడియాలో సర్కారు వారి పాట సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆ చర్చ వల్ల ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. 

#ad2

సినిమా ఫస్ట్‌ హాఫ్ లో అయిదు పది నిమిషాలు తప్ప అంతా బాగానే ఉది. ఇక సెకండ్‌ హాఫ్ లో ప్రథానంగా మహేష్‌ బాబు, కీర్తి సురేష్‌, సుబ్బరాజు పాత్రల మద్య ఉండే సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. వాటిని కామెడీ సన్నివేశాలు అంటూ జొప్పించే ప్రయత్నం చేశాడు కాని మరీ దారుణం అవి ఉన్నాయి. మహేష్ బాబు స్థాయిని దిగ జార్చే విధంగా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. బీచ్ లో ఫైట్‌ చాలా బాగా వచ్చింది. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఓవరాల్‌ గా సినిమా బాగానే ఉన్నా.. కొన్ని మైనస్ లు అయితే ఉన్నాయి. వాటిని కొందరు హైలైట్ చేసి చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. సినిమాకు బ్యాడ్‌ టాక్ వల్ల భారీ నష్టం తప్పేలా లేదు. 

Scroll to Top