శేఖర్ ట్రైలర్ : డ్యూటీ కోసం ప్రాణమిచ్చే వాడు వేలల్లో ఒక్కడే

BY T20,

యాంగ్రీ యంగ్ మెన్ డా. రాజశేఖర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేస్తున్నారు. గతంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన మరోసారి తన సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'పీఎస్ వీ గరుడ వేగ' ప్రశాంత్ వర్మ 'కల్కీ' చిత్రాలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన డా. రాజశేఖర్ ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా గుడ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అనిపించుకున్నారు. కోవిడ్ కారణంగా చాలా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆయన కొంత విరామం తరువాత మళ్లీ తనకు కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

డా. రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం 'శేఖర్'. జీవితా రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'జోసెఫ్' ఆధారంగా ఈ మూవీని ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. కెరీర్ పరంగా విభిన్నమైన పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్న రాజశేఖర్ చేస్తున్న మరో డిఫరెంట్ థ్రిల్లర్ ఇది. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో నటించింది. తొలి సారి ఇలా ఈ తండ్రీ కూతుళ్లు కీలక పాత్రల్లో తల్లి జీవిత డైరెక్టర్ గా రూపొందిన సినిమాగా ఈ చిత్రం అరుదైన ఘనతని సాధించింది.

ఇందులో రాజశేఖర్ శివానీ రియల్ లైఫ్ తరహాలోనే తండ్రీ కూతుళ్లుగా నటించారు. దీంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. పోలీస్ పాత్రల్లో రాజశేఖర్ నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అన్నిటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గురువారం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. సమీర్ వాయిస్ ఓవర్ లో ట్రైలర్ మొదలైంది. 'పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా డ్యూటీ చేయని వాళ్లు చాలా మంది వుంటారు. అదే పోలీస్ ఉద్యోగానికి రిజైన్ చేసి కూడా డ్యూటీ కోసం ప్రాణమిచ్చే వాళ్లు వేలల్లో ఒక్కరే వుంటారు అంటూ రాజశేఖర్ స్వాగ్ ఎంట్రీతో ట్రైలర్ మొదలైంది.

ఇందూకి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ ప్రమాదం కాదని శేఖర్ కనిపెడతాడు. అసలు శేఖర్ ఎవరు? అతని గతమేంటీ? . వరుస హత్యల వెనక వున్నది ఎవరు? .. సుంకర మెట్టకు చెందిన శేఖర్ వరుస హత్యల వెనకున్నది ఎవరో కనిపెట్టాడా? ఫైనల్ గా ఏం జరిగింది? కథ ఎలా సుఖాంతమైంది? అన్నదే ఈ చిత్ర ప్రధాన కథ. రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో తనదైన స్వాగ్ తో టెర్రిఫిక్ గా కనిపిస్తున్నాడు. ప్రకాష్రాజ్ ఆత్మీయ రంన్ అభినవ్ గోమఠం కన్నడ కిషోర్ సమీర్ తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రాజశేఖర్ కు మరో హిట్ ని అందించేలా కనిపిస్తోంది.

Scroll to Top