తాజ్ మహల్ కంటే సోమ్ నాథ్ ఆలయం గొప్పనట..?

BY T20,

తాజ్ మహల్ అంటే ప్రేమకు చిహ్నం.. ముంతాజ్ పై షాజహాన్ కు ఉన్న ప్రేమకు ప్రతిరూపం. అమెరికా అధ్యక్షుడంతటి వాడు కూడా వచ్చి ఈ ప్రేమ చిహ్నం చూసి తరించిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకిది ప్రపంచపు వింతగా మారిందో తెలుసుకోవచ్చు.

తాజ్ మహల్ ఓ వర్గానికి సంబంధించినది ఇప్పుడు బీజేపీ పాలనలో పరిమితం చేయడం వివాదాస్పదమైంది. ఇక బీజేపీ వాదులు హిందుత్వ వాదులు సైతం తాజ్ మహల్ పై విమర్శలు చేస్తుంటారు. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ ఆమె చెల్లెలు రంగోలీ సైతం తాజ్ మహల్ పై ఆరోపించారు.  'తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమే.. అది ఎప్పటికీ ప్రేమ చిహ్నం కాదు..' అంటూ చెప్పారు.

అంతేకాదు.. తాజ్ మహల్ ను చాలా మంది సమాధిగా చూస్తారు.. ప్రపంచవింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు.. ముంతాజ్ పై ఉన్న ప్రేమ గౌరవంతో షాజాహాన్ నిర్మించిన అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్లు గగుర్పొడిచే విషయాలున్నాయని.. ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించాడో తెలుసా' అంటూ రంగోలి ఇష్టమొచ్చినట్టు చరిత్రను వక్రీకరిస్తూ ట్వీట్ చేసింది.అది కూడా వివాదాస్పదమైంది.

భారత్ కు చిహ్నంగా అందరూ 'తాజ్ మహల్'ను చూపిస్తారు. కానీ తాజ్ మహల్ కంటే ఎన్నో గొప్ప కట్టడాలు  భారత్ లో ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓ అమెరికన్ రచయిత తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టాడు. తాజ్ మహల్ కంటే గొప్ప ఆలయాలు.. చారిత్రక సంపద దాగి ఉందని ప్రముఖ అమెరికన్ రచయిత రాబర్ట్ బి. స్పెన్సర్ అభిప్రాయపడ్డారు.

భారతదేశ తత్వానికి ఖచ్చితమైన యోగ్యమైన చిహ్నం సోమనాథ్ ఆలయం అని అమెరికన్ రచయిత రాబర్ట్ బి. స్పెన్సర్ అభిప్రాయపడ్డారు. విచారకరం ఏంటంటే ఇండియా అనగానే తాజ్ మహల్ ను చూపిస్తుంటారని.. వాస్తవానికి సోమనాథ్ ఆలయం అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ ఆలయం జిహాదీలచే నాశనం చేయబడ్డ మొదటి ఆలయం అని.. శతాబ్ధాలుగా పునర్నిర్మిస్తూ వచ్చారని చెప్పారు. మధురై శ్రీరంగం కాశీ విశ్వనాథ ఆలయాలు కూడా ఉన్నాయంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు.

ఇవే కాదు ఎన్నో చారిత్రక ఆలయాలు భారత్ లో ఉన్నాయి. హిందూ రాజులు కట్టించిన దేవాలయాలు ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాయి. కానీ వాటికి గుర్తింపు లేదు. వరంగల్ లోకి రామప్ప దేవాలయం కూడా హెరిటేజ్ ఆలయంగా పేరొందింది. ఇలాంటివాటికి గుర్తింపునిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

Scroll to Top