రెండే రెండు హిట్టు.. 28 సినిమాలు తీసిన హీరో.. ఎవరో తెలుసా?

BY T20,

ఎంతో విలక్షణమైన కథలను ఎంపిక చేసుకొని, హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు నటుడు సందీప్ కిషన్.దేవా కట్ట దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన ప్రస్థానం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

అనంతరం డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన సందీప్ కిషన్ అనంతరం నటనపై మక్కువతో హీరోగా కొనసాగారు.

ఈ విధంగా సందీప్ కిషన్ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 28 సినిమాలలో నటించారు. అయితే ఈయన నటించిన సినిమాలలో కేవలం రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అందులో సందీప్ కిషన్ హీరోగా తొలి విజయాన్ని అందుకున్న సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్. ఈ సినిమా సందీప్ కిషన్ హీరోగా నిలబెట్టింది.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సందీప్ కిషన్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలన్నీ తనకు పెద్దగా పేరు తీసుకు రాలేదు. వీ. ఐ. ఆనంద్ అందించిన టైగర్ సినిమా సందీప్ కు దక్కిన రెండవ విజయం. ఈ సినిమాలో సందీప్ కిషన్ నటన పై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.ఈ విధంగా తన 12 సంవత్సరాల సినీ కెరీర్లో సందీప్ కిషన్ 28 సినిమాలలో నటించిన ఈయనకు బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందించాయని చెప్పాలి.

Scroll to Top