పిల్లికి బిచ్చం పెట్టని ఎన్టీఆర్ కు ఓటు వేయకండి.. అప్పట్లో హీరో కృష్ణ షాకింగ్ ప్రసంగం?

BY T20,

సూపర్ స్టార్ కృష్ణ.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ వీరిద్దరికీ ఎప్పటినుంచో పోసిగేది కాదు అన్నది ఎప్పుడూ ఇండస్ట్రీ లో ఉండే టాక్. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అటు అందరు ఎన్టీఆర్ కి మద్దతుగా నిలబడితే సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఎన్టీఆర్ విధానాలను విమర్శలు చేస్తూనే ఉండేవారు.

ఈ క్రమంలోనే 1984లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక ఎన్టీఆర్ కు టిడిపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా అక్కడ ఒక అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.

ఎన్టీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అంటూ విమర్శించారు. నెహ్రూ కుటుంబం దేశం కోసం ఎంతో చేసిందని ఆస్తులను కూడా ధారపోసిందని చెప్పారు కృష్ణ. కానీ ఎన్టీఆర్ మాత్రం తన ఫ్యామిలీ కోసం 200 కోట్లు సంపాదించి పెట్టి ఆ తర్వాత రాజకీయాల్లో సంపాదించడానికి వచ్చారు అని విమర్శించారు. కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లపై నే ఎన్టీఆర్ ప్రతి నెల మూడు లక్షల వడ్డీ పొందుతారని చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ మరణం తర్వాత ఇక దేశంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సమయంలో రాజీవ్ గాంధీ రాత్రి సమయంలో స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్లి పరిస్థితులను సద్దుమణిగేలా చేశారని గుర్తు చేశారు సూపర్ స్టార్ కృష్ణ.కానీ ఎన్టీఆర్ మాత్రం తన పదవి కోల్పోగానే రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు వస్తాయని.. విప్లవం తెరమీదికి వస్తుందని.. రక్తపాతం జరుగుతుందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలా ప్రజల బాగోగులు కోరే వ్యక్తికీ ఓటు వేస్తారా.. రక్తపాతం కావాలి అనుకున్న వ్యక్తి కి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. దేశం కోసం ఆస్తులను త్యాగం చేసిన రాజీవ్ గాంధీ కి ఓటు వేసి గెలిపిస్తారా లేకపోతే కనీసం పిళ్లికి కూడా బిచ్చం పెట్టని ఎన్టీఆర్ కు ఓటు వేస్తారా అంటూ ప్రశ్నించారు.అయితే సూపర్ స్టార్ కృష్ణ ఇలా ప్రసంగిస్తున్న సమయంలో అక్కడికి లక్ష మందికి పైగా విచ్చేసిన అభిమానులు పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షధ్వానాలు చేశారు అని చెప్పాలి..

Scroll to Top