దేశంలో మద్యం హోం డెలివరీ ఎందుకు చేయరు? కారణమేంటి?

BY T20,

జోమాటో స్విగ్గీ లాంటివి వచ్చాక ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ పెరిగిపోయింది. ఇక ఫ్లిప్ కార్ట్ అమెజాన్ జియో మార్ట్ లతో ఇప్పటికే ఇంటింటికి వస్తువుల పంపిణీ జరుగుతోంది. వస్తువులు ఆహారం అంతా ఆర్డర్ పై వస్తుంటే.. ఒక్క మద్యం మాత్రం ఎందుకు రాదు..? మనమే ఎందుకు వైన్ షాప్ కు వెళ్లి తెచ్చుకోవాలి.? ఫుడ్డు లాగానే మద్యం కూడా ఆన్ లైన్ డెలివరీ అయితే ఎంత బాగుండు? ఇంట్లోనే కడుపులో ‘బీరు’ కదలకుండా మద్యాన్ని తెచ్చుకోవచ్చు.

కానీ అన్ని రకాల ఆన్ లైన్ సేవలు ఉన్నా లిక్కర్ ను మాత్రం హోం డెలివరీ చేయడానికి ఇంకా దేశంలో అందుబాటులో సర్వీస్ లేదు. దేశంలో మద్యాన్ని హోం డెలివరీ ఎందుకు చేయరో తెలుసా? దీనికి కారణాలున్నాయి. దీనికి చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయి. దేశంలో మద్యం హోం డెలివరీకి ప్రభుత్వాలు ఒప్పుకోవు.

దేశంలో మద్యం ప్రియులకు ఢోకాలేదు. తాగడం పోటీలు పడితే మనవాళ్లే ఫస్ట్ వస్తారు. అంతలా తాగేస్తారు.. తాగి ఊగేస్తారు. దేశంలో ఢిల్లీ చెన్నై బెంగళూరు హైదరాబాద్ లోని దాదాపు 81శాతం మంది వినియోగదారులు తమ రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని ఇంటికి హోం డెలివరీ చేయడానికి అనుమతించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

కరోనా కారణంగా బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. పైగా సామాజిక దూరం పాటించాలి. అందుకే చాలా మంది ఇంటికే మద్యం డెలివరీ కోరుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా తమ అయిష్టతను కొనసాగిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ విధానంపై విముఖత చూపాయి.

కరోనా మహమ్మారి రాష్ట్రాలకు అల్కహాల్ ను ఇంటి డెలివరీ అందించడం వల్ల ఆర్థిక ప్రయోజన కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. దానివల్ల సదురు రాష్ట్రప్రభుత్వాల ఖజానాలకు అధిక పన్ను రాబడి వచ్చే అవకాశమూ ఉంది. బెజరీస్ పై ఎక్సైజ్ సుంకం మద్య పానీయాలు పెట్రో ఉత్పత్తుల అమ్మకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాట్ రూపంలో అత్యధికంగా ఆదాయం వసూలవుతుంది. వారి ఆర్థిక ప్రయోజనం కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని మద్యం డోర్ డెలివరీ అందించింది. ఇక చిల్లర వ్యాపారులకు సమానంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

మద్యం ఆన్ లైన్ డెలివరీతో అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు దుకాణాలకు వెళ్లినప్పడు అనవసరంగా అటెన్షన్ పొందకుండా కొనుగోళ్లను సులభతరం చేస్తాయి. 78శాతం మంది మహిళలు ఇంటి డెలివరీలు అనుమతిస్తే కొనుగోలు చేసే అవకాశాలుంటాయి.

అయితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విశృంఖల మద్యం హోం డెలివరీ కారణంగా రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతాయని ఆ దిశగా అమలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ పద్ధతితో తక్కువ వయసు ఉన్న వారు మద్యం తెప్పించుకొని తాగే ప్రమాదం ఉంది. అందుకే ఆ దిశగా ప్రస్తుతానికి ఆలోచించడం లేదు.

Scroll to Top