Taj Mahal : తాజ్ మహల్ స్మారకం కాదు శివాలయం..లోపల గదుల్లో హిందూ విగ్రహాలు!

BY T20,

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్.. ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. మెుఘల్‌ చక్రవర్తి అయిన షాజహాన్‌, ముంతాజ్‌ ప్రేమకు చిహ్నాంగా తాజ్‌మహల్‌ ను చెప్పుకుంటారు.

అయితే ఈ తాజ్‌మహల్‌ ముంతాజ్‌ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని మరో వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో దాని గుట్టు విప్పాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు అయింది. నాలుగు అంతస్థుల తాజ్ మహల్‌లోని కింది రెండు అంతస్థుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసేశారని,తాజ్‌ మహల్‌లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారా తెరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌ లో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మూసి ఉన్న గదుల తలుపులు తెరవాలని పిటిషన్‌లో కోరారు. ఇందుకోసం ఏఎన్ఐ చేత నిజ నిర్ధారణ జరిపించాలని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించేలా, కోర్టు సమక్షంలోనే ఆ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. దశాబ్దాల కాలంగా మూసి ఉన్న ఆ గదుల లోపల హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారన్నారు. ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కొందరు చరిత్రకారులు, హిందూ సంస్థలు తాజ్ మహల్‌ ఒక పురాతన శివాలయం అని వాదిస్తున్నారని కూడా పిటిషనర్ పేర్కొన్నారు.

ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ అని చాలామంది చరిత్రకారులు విశ్వసిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఇది తేజో మహాలయ, తాజ్ మహల్ జ్యోతిర్లింగం అని నమ్ముతున్నారని కూడా పేర్కొన్నారు. కొన్ని హిందూ సమూహాలు ఇప్పటికీ శివుడి తేజో మహాలయంగా తాజ్‌మహల్‌ను విశ్వసిస్తున్నారని కోర్టుకు గుర్తుచేశారు. భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్‌ కోర్టుకు సమర్పించారు. ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో వాటి గుట్టును విప్పేందుకు కోర్టుకు చొరవ తీసుకోవాలని పిటిషనర్‌ కోర్టుని కోరారు.

Scroll to Top