తరుణ్ సినిమా సునామీ ముందు.. కొట్టుకుపోయిన మహేష్ బాబు సినిమా

BY T20,

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుంది.ఏ హీరోకి ఎప్పుడు హిట్ వస్తుంది అన్నది ఎప్పుడు ఎవరికి ఊహకందని విధంగానే ఉంటుంది. ఎందుకంటే హిట్ అవుతుంది అన్న నమ్మకంతోనే ప్రతి ఒక్కరు సినిమాలు తీస్తూ ఉంటారు.

కానీ ఆ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులు. కొన్ని కొన్ని సార్లు భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు సైతం ఇక అంచనాలను అందుకోలేక ఫ్లాప్ గానే మిగిలిపోతుంటాయి. ఇలాంటి సినిమాలలోనే అటు మహేష్ బాబు నటించిన వంశీ సినిమా కూడా ఒకటి.

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అప్పుడప్పుడే ఇండస్ట్రీకి అడుగుపెడుతున్నాడు మహేష్ బాబు. అప్పటికే యువరాజు రాజకుమారుడు సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అదేసమయంలో నమ్రత మహేష్ బాబు హీరో హీరోయిన్లు ఒక సినిమా వచ్చింది. అదే వంశీ. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. 2000 సంవత్సరంలో అక్టోబర్ నెలలో విడుదల అయింది ఈ సినిమా. సినిమా నమ్రతకు తెలుగులో మొదటి సినిమా కావడం గమనార్హం. కానీ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.

మరీ ముఖ్యంగా యువ హీరో తరుణ్ నటించిన నువ్వేకావాలి సినిమా సృష్టించిన సునామీ ముందు వంశీ సినిమా కొట్టుకు పోయింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించిన నువ్వేకావాలి సినిమా లో తరుణ్ సరసన రిచా నటించింది. ఇక అప్పుడు స్టార్ హీరోలందరి సినిమాలు వెనక్కి నెట్టి నువ్వే కావాలి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. శతదినోత్సవం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంది నువ్వేకావాలి సినిమా. అప్పట్లో మహేష్ బాబు నటించిన వంశీ సినిమా ఫ్లాప్ గా మిగిలి పోతే నువ్వే కావాలి మాత్రం సునామి సృష్టించటంతో తెలుగు ఇండస్ట్రీ చూపు మొత్తం తరుణ్ వైపు మళ్ళింది.

Scroll to Top