ఉప్పెన సీన్ రిపీట్ చేసిన యువతి తండ్రి.. రోకలిబండతో చితక్కొట్టాడట

BY T20,

పెద్ద అంచనాలు లేకుండా విడుదలై.. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న చిన్న మూవీ ఉప్పెన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాఢమైన లవ్ స్టోరీ అయినప్పటికీ ఎండింగ్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. సినిమాకు కాస్త భిన్నమైన సీన్ చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లాలోని నరసింహారావు పాలెంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..మనసుకు నచ్చిన ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు. ఏదోలా ఆ అమ్మాయి మనసు దోచుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీంతో.. ఆమె వెంట పడుతూ తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. అయితే.. తన కుమార్తె వెంట పడుతున్న ఆ అమ్మాయి తండ్రికి ఈ విషయం తెలిసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. ఆ కుర్రాడిని మాట్లాడటానికి ఇంటికి పిలిచాడు.

ఇంటికి వచ్చిన ఆ యువకుడ్ని గదిలో బంధించేశాడు. అనంతరం రోకలి బండతో యువకుడి మీదకు దాడి చేశాడు. అతడి మర్మాంగంపై దాడికి పాల్పడ్డారు. రోకలి బండతో మర్మాంగాన్ని చితక్కొట్టేశాడు. దీంతో తీవ్ర గాయానికి గురైన అతడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. దీంతో అతడ్ని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు సైతం యువకుడ్ని.. అతడికి అయిన గాయం తీవ్రతను చూసిన వారు విజయవాడకు తీసుకెళ్లాలని కోరారు. దీంతో.. విజయవాడకు తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అతడి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజులు గడిస్తే మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఏమైనా.. కుమార్తెను ప్రేమించాడన్న కారణంగా తండ్రి చేసిన రాక్షస కాండ అమానుషంగా చెప్పక తప్పదు.

Scroll to Top