ఇండియాలో వున్న టాప్ డాన్సర్ ఎవరు?

BY T20,

ఇండియన్ సినిమాలకు సంగీతానికి డాన్స్ కు అవినాభావ సంబంధం వుంది. మిగతా దేశాలతో పోలిస్తే సంగీతం డాన్స్ కు మన సినిమాల్లో ప్రత్యేక స్థానం వున్న విషయం తెలిసిందే. మన సినిమా మాలీవుడ్ మూవీస్ తో పోటీపడుతున్నా ఇప్పటికీ మనం మన సినిమాల్లో డాన్సులకు పాటలకు ప్రధాన్యం ఇస్తున్నాం. భరతనాట్యం కూచిపూడి కథకళి.. డిస్కో డాన్స్ బ్రేక్ డాన్స్.. ఇలా పలు రకాల డాన్స్ లకు సినిమాల్లో ప్రధాన్యత నిచ్చాం. కథ సన్నివేశాల డిమాండ్ ని బట్టి పాటలకు డాన్స్ కు ప్రధాన్యత పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ డాన్స్ డే సందర్భంగా ఇండియన్ సినిమాల్లో టాప్ డాన్సర్ల పై అందిస్తున్న ప్రత్యేక కథనమిది.    

అప్పటి వరకు ఇండియన్ సినిమా భరతనాట్యం కూచిపూడి కథకళి వంటి డాన్సులు.. సాధారణ స్టెప్పులతో సాగితే 80వ దశకంలో వచ్చిన 'డిస్కో డాన్సర్' కొత్త పుంతలు తొక్కించింది. భారతీయ సినిమాల్లోని డాన్స్ కు సరికొత్త సొబగులద్దింది. అంత వరకు ఉత్తరాది సినిమాలతో పాటు దక్షిణాది చిత్రాల్లో జానపద డాన్సలు మాత్రమే కనిపించేవి. టాలీవుడ్ సినిమాల్లో డాన్సుల పరంగా అక్కినేని కొంత వరకు మార్పుని తీసుకొచ్చారు. హీరో నిలబడి వుంటే హీరోయిన్ డాన్స్ చేయడం వంటివి వుండేవి కానీ అక్కినేని డాన్స్ మొదలు పెట్టడంతో కొంత మార్పు మొదలైంది.

ఆ తరువాత దక్షిణాదిలో డాన్సులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి. బాలీవుడ్ లో మిధున్ చక్రవర్తి 'డిస్కో డాన్సర్' సినిమాతో డిస్కో డాన్స్ ని తెరపైకి తీసుకొస్తే దక్షిణాదిలో చిరు బ్రేక్ డాన్స్ అంటూ కొత్త వొరవడికి శ్రీకారం చుట్టారు.

అప్పట్లో మెగా జోరుకు తగ్గట్టుగా డాన్స్ ఇరగదీసిన హీరోయిన్ లు చాలా తక్కువ మందే వున్నారు. అందులో ముందు వరుసలో నిలిచిన హీరోయిన్ లు రాధా భాను ప్రియ. వీళ్లు చిరుతో పోటీపడి మరీ డాన్సుల్లో తమ సత్తాని చాటారు. ఇప్పటికి చిరు స్టెప్పేస్తే అభిమానులు థియేటర్లలో గోల చేయడం మామూలే.

బాలీవుడ్ లో తొలి తరం నటుస్లో హేమా మాలిని. ఆ తరువాత రేఖ మంచి డాన్సర్స్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో వున్న టాప్ డాన్సర్ హృతిక్ రోషన్. ఇప్పటికీ అదే గ్రేసు.. అదే స్టైల్ తో హృతిక్ డాన్సుల్లో తనదైన స్టెప్పులతో అదరగొడుతున్నాడు. టైగర్ ష్రాఫ్ మాధురీ దీక్షిత్ ఐశ్వర్యారాయ్ గోవిందా షాహీద్ కపూర్ టాప్ డాన్సర్ లుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ ఇద్దరే టాప్ డాన్సర్స్ ఒకరు హృతిక్ రోషన్. మరొకరు మాధురీ దీక్షిత్.

ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ డాన్సుల్లో తన సత్తాని చాటుతున్నారు. అయితే ముందు వరుసలో నిలిచింది మాత్రం అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వున్నారు. ఆ తరువాతి స్థానాల్లో రామ్ చరణ్ వున్నారు. ఇండియా వైడ్ గా వున్న ఫిల్మ్ స్టార్లలో టాప్ లో వున్న వాళ్లు చాలా తక్కువ మందే వున్నారు. అయితే అందులో ముందు వరుసలో బన్నీ వున్నాడు. ఆ తరువాత స్థానంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నిలవగా తరువాతి స్థానంలో ప్రభు దేవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిరంజీవి మాధురీ దీక్షిత్ రాఘవ లారెన్స్ రామ్ చరణ్ తమిళ హీరో విజయ్ ఐశ్వర్యారాయ్  శింబు గణేష్ హెగ్డే తదితరులు వుండటం విశేషం.

Scroll to Top