స్పేస్ గురించి మీకు తెలియని టాప్ 10 ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ (INTERESTING SPACE FACTS IN TELUGU)
2021-02-14 17:35 IST

ADVERTISEMENT
మనకి తెలిసినంతవరకు ఏలియన్స్ ఉన్నట్లు మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఒకసారి అంతరిక్షం నుండి మనకి రేడియో సిగ్నల్స్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. అసలు ఆ మెసేజ్ లో ఏముంది? దానిని ఎవరు పంపించారు? ఇంకా స్టీఫెన్ హాకింగ్ గారు ఒకసారి టైం ట్రావెలర్స్ కి ఒక పెద్ద పార్టీ ఇచ్చారు. అలాగే స్పేస్ లో ఉన్న జాంబి గెలాక్సీ గురించి మీకు తెలుసా? ఇంకా ఇటువంటి ఎన్నో ఇంటరెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం!
1
ఇప్పటివరకు మనిషి స్పేస్ లోకి పంపించిన పెద్ద ఆబ్జెక్ట్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా పెద్దది. దీనిని అనేక దేశాల పార్ట్శ్ ని కంబైన్ చేసి తయారు చేశారు. ఈ స్టేషన్ ని భూమి నుండి ఎటువంటి టెలిస్కోపులు లేకుండా కూడా చూడొచ్చు. అయితే దీనిని మీరు చూడాలనుకుంటే ఈ స్టేషన్ మీ మీద నుండి వెళ్తున్నపుడు చూడగలరు. ఇలా దీనికోసం నాసాకు సంబంధించిన “స్పాట్ ది స్టేషన్” అనే వెబ్ సైట్ లో కనుక రిజిస్టర్ అయితే ఈసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీ వైపునుండి వెళ్తున్నప్పుడు నాసా మీకు మెసేజ్ గాని...ఈమెయిల్ గాని పంపుతుంది. ఇలా మీరు 400 కిలో మీటర్ల ఎత్తులో వెళ్తున్న స్పేస్ స్టేషన్ ను మీరు ఎటువంటి టెలిస్కోపు లేకుండా మీ ఇంటి నుండే చూడొచ్చు.
ADVERTISEMENT