టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ (Top 10 interesting and unknown facts)
2021-02-12 15:38 IST

ADVERTISEMENT
నిజజీవితంలో గజిని లాంటి ఒక వ్యక్తి ఉన్నారు...అతను అలా ఎలా మారాడు? ఇప్పటిదాకా జంతువులని బంధించడం లేదా మనుషులను బంధించడం గురించి వినే ఉంటారు కానీ మీరు ఒక మనిషి యొక్క శ్వాస ని బంధించడం గురించి విన్నారా? అసలు ఆ శ్వాస ఎవరిది? మరియు ఎందుకు దాన్ని బంధించారు. అలాగే మీరు రాత్రికి రాత్రే ఒక బిలినియర్ అయిపోతే అప్పుడు మీరు అన్ని కార్లను కొనగలరు. కానీ రోల్స్ రాయిస్ కార్ మాత్రం కొనలేరు. ఎందుకో తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం!
10
ఇండియా ఐరన్ క్వీన్ గురించి మీకు తెలుసా? ఈమె పేరు ఆశ రాణి. ఈమె కున్న జుట్టు వల్ల ఈమెను ఐరన్ క్వీన్ అని అంటారు. ఈమె పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డు లో కూడా ఉంది. ఆశ తన జుట్టు సహాయంతో లండన్లో ఒక డబుల్ డెక్కర్ బస్సుని లాగింది. దాని బరువు 12,216 కేజీలు. 2014వ సంవత్సరంలో ఇటలీ లో ఒక షోలో ఆశ ప్రపంచంలోనే అన్నిటికంటే బరువైన వెహికల్ ని లాగి ఈ రికార్డు ని నమోదు చేసుకుంది.
ఇదొక్కటే కాదు..అందరి కంటే స్పీడ్ గా ఒక వెహికల్ ని 25మీటర్ల వరకూ అది కూడా తన పళ్ళ తో.. అలాగే తన చెవులతో చాలా పెద్ద బరువులు లాగింది. అందుకే ఈమెను ఇండియా యొక్క ఐరన్ క్వీన్ అని పిలుస్తారు.
ADVERTISEMENT