టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ (Top 10 Interesting Facts)
2021-02-12 15:24 IST

ADVERTISEMENT
మన డిఎన్ఏ ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో మనకి ఎప్పుడూ హార్ట్ ఎటాక్ వస్తుంది.. ఎప్పుడు కాన్సర్ వస్తుందో మనం ముందే కనిపెట్టొచ్చు. నిజానికి మనిషికి మరణం లేకుండా చేసే టెక్నాలజీ ఇది. మనం ఎందుకు ఎప్పుడూ చంద్రుడికి ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం.. అసలు చంద్రుడి అవతలి వైపు ఏముంది? అలాగే చైనా లో విధించే అతి భయంకరమైన శిక్ష గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంకా ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం!
1
సాధారణంగా జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది భూకంపాలు,సునామీలు మరియు తుఫానులు వంటి నాచ్యురల్ డిజాస్టర్స్. దీనికి ప్రధాన కారణం జపాన్ యొక్క జియోగ్రఫీ. పసిఫిక్ మహాసముద్రం లోని రింగ్ ఆఫ్ ఫైర్ లో టెక్టోనిక్ ప్లేట్స్ కోలిజన్ జరిగినప్పుడు ఓషన్స్ లో మూవ్మెంట్స్ క్రియేట్ చేస్తాయి. అండ్ అలాగే అగ్నిపర్వతాలు ఉన్న దేశాల్లో జపాన్ మూడో ప్లేస్లో ఉంది. దీని కారణంగా ఇక్కడ ఎక్కువ వోల్కనిక్ ఎరప్షన్స్ జరుగుతాయి. దీనివల్ల పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఎక్కువగా భూకంపాలు రావడంతో ఓషన్స్ లో వేవ్స్ సునామీలుగా మారి జపాన్ పై ఎటాక్ చేస్తాయి. ఈ టెక్టోనిక్ మూవ్మెంట్స్ పసిఫిక్ మహాసముద్రంలో కామన్ గా జరుగుతుంటాయి. ఇది జపాన్ లో ఎక్కువ నాచ్యురల్ డిజాస్టర్స్ రావడానికి దారి తీస్తాయి. దీనికి ఉదాహరణగా జపాన్లో 11 మార్చ్ 2011 న అతిపెద్ద సునామీ ఏర్పడింది. ఈ భారీ సునామీ వల్ల జపాన్లో 200 చదరపు మైళ్ల తీరప్రాంతం మునిగిపోయింది.
ADVERTISEMENT