టాప్ 10 ఆసక్తికరమైన విషయాలు(Top 10 Interesting Facts)
2021-02-15 13:45 IST

ADVERTISEMENT
ఒకవేళ చేపలు నీటిలో నుంచి బయటికి వస్తే అవి కొన్ని నిమిషాల్లోనే చనిపోతాయి. కానీ ఈ చేపలు మాత్రం నీళ్ళు లేకుండా మూడున్నర రోజులు నేల మీద జీవిస్తాయి. మామూలుగా మనకి కొన్ని దేశాల మధ్య యుద్ధం మనుషులు చేయడం గురించి తెలుసు. అయితే జంతువుల మధ్య కూడా ఒక మహాయుద్ధం నాలుగు సంవత్సరాలపాటు జరిగింది. అలాగే ఈ స్కార్ఫ్ వేసుకుంటే ఫోటోల్లో మనం ఎవరికీ కనిపించకుండా ఇన్విజిబుల్ అయిపోవచ్చు. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం!
1
మన ఇంటికి కాపలా కి మరియు రక్షణ కోసం మనం కుక్కని పెంచుకుంటాం. అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. కానీ చైనాలోని కొన్ని పోలీస్ స్టేషన్స్ లో మాత్రం కుక్కల్ని పెట్టకుండా పెద్ద పెద్ద బాతులని పెడతారు. ఇవి మంచి సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేస్తాయి. వీటికి ఏ చిన్న శబ్దం వినిపించినా ఆ ప్లేస్ లోకి వెళ్లి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాయి. ఒకవేళ దొంగలు కనుక అక్కడ ఉంటే ఆ బాతులు అన్నీకలిసి పెద్ద పెద్దగా అరుస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే వచ్చిన ఆ దొంగని పొడుస్తాయి కూడా. ఇలా ఇప్పటివరకు ఈ బాతులు చాలా దొంగలని పట్టించాయి. చైనా పోలీసులు వీటికి కొంత ట్రైనింగ్ ని కూడా ఇస్తారు.
ADVERTISEMENT