టాప్ 16 ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్(Top 16 Interesting Facts )
2021-02-11 15:57 IST

ADVERTISEMENT
ఈ అనంత విశ్వంలో అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకోవడానికి మానవుడు ప్రతి క్షణం ఎంతో ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే ఈ భూమి మీద సైన్స్ కి కూడా తెలియని ఎన్నోరహస్యాలు ఉన్నాయి. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
1
ఈ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టు manchineel ట్రీ. ఈ చెట్టుకు ఉండే ఆకులు, కాండం, పండ్లు అన్ని విషపూరితమే. ఈ చెట్టుని అస్సలు ముట్టుకోకూడదు. కనీసం ఈ చెట్టు దగ్గర గాలి కూడా పీల్చకూడదు. ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు ఆకుల నుండి జారి పడిన ఒక్క వాన చినుకు అయిన మన శరీరం మీద పడితే ఆ ప్రదేశమంతా బొబ్బలు,మంటలు,అలర్జీ గా మారి చివరకు ప్రాణాలను కూడా కోల్పోవచ్చు. ఈ చెట్టు అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. మోస్ట్ డేంజరస్ ట్రీ గా దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉంది.
ADVERTISEMENT