ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడి చేతికి ట్విట్టర్

BY T20,

ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడైన ఎలన్ మస్క్  తాజాగా ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ సంస్థను హస్తగతం చేసుకున్నాడు. ముందు నుంచి స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు  సోషల్ మీడియా పెద్ద పీట వేయాలని చెబుతుండే మస్క్ అనుకున్నట్టే ట్విట్టర్ ను టేకోవర్ చేయడం విశేషం.  

ఇప్పటికే ట్విట్టర్ ను భారీ రేటుకు కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కోట్ల ఆఫర్ ఇచ్చాడు. ఇక ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ లో 9.2 శాతం షేర్లను కలిగి ఉన్నాడు. దీంతో  శుక్రవారం మస్క్ కంపెనీకి చెందిన పలువురు షేర్ హోల్డర్లతో ప్రైవేట్ మీటింగ్ నిర్వహించిన తర్వాత ట్విట్టర్ వైఖరి మారినట్లు సమాచారం. ఎలన్ మస్క్ కు ట్విట్టర్ ను ఇవ్వడానికి ఒప్పుకుంది.

అంతకుముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మస్క్ తరుపున కంపెనీని టేకోవర్ చేయకుండా నిరోధించడానికి ట్విట్టర్ బోర్డు 'పాయిజన్ పిల్ స్ట్రాటజీ'ని అనుసరించింది. ఈ డీల్ పై చర్చలు జరపడానికి బోర్డు సభ్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిరసన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కానీ ట్విట్టర్ మస్క్ ఆఫర్ కు అంగీకరించింది. దాదాపు 44 బిలియన్ డాలర్ల(రూ.3364284000000 కోట్లు) ను ట్విట్టర్ కొనుగోలుకు ఎలన్ మస్క్ వెచ్చించాడు. ట్విట్టర్ ప్రతీ షేర్ కు రూ.54.20 డాలర్లు చెల్లించాడు.

ప్రపంచ నంబర్ 1 కుబేరుడు చేతిలోకి అతిపెద్ద సోషల్ మీడియా చేరింది.  ఎలన్ మస్క్ ను ట్విట్టర్ యజమాని అని పిలవవచ్చు అంటూ ఆయన తొలి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఇక ట్విట్టర్ లో 'ఫ్రీ స్పీచ్.. స్వేచ్ఛ ఉంటుందని' తొలి పోస్ట్ చేశాడు.

ఒప్పందం పూర్తయిన తర్వాత ట్విట్టర్ ప్రైవేట్ కంపెనీగా మారుతుంది. ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ఇక ట్విట్టర్ తన సరికొత్త ప్రయాణాన్ని సాగించనుంది. సోమవారం అర్ధరాత్రి ట్విట్టర్ బోర్డు కలిసి ఎలన్ మస్క్ ఆఫర్ ను అంగీకరించింది.https://www.facebook.com/v2.10/plugins/page.php?adapt_container_width=true&app_id=184607281565521&channel=https%3A%2F%2Fstaticxx.facebook.com%2Fx%2Fconnect%2Fxd_arbiter%2F%3Fversion%3D46%23cb%3Df221211db7614b%26domain%3Dwww.tupaki.com%26is_canvas%3Dfalse%26origin%3Dhttps%253A%252F%252Fwww.tupaki.com%252Ff2468b2ffcf19a8%26relation%3Dparent.parent&container_width=665&height=140&hide_cover=false&href=https%3A%2F%2Fbusiness.facebook.com%2FTupakidotcom%2F&locale=en_US&sdk=joey&show_facepile=true&small_header=false&tabs=timeline

Scroll to Top