వీడియో : ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇంకా తగ్గని ‘పుష్ప’ రేంజ్

BY T20,

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా పుష్ప సినిమా విడుదల అయ్యి చాలా నెలలు అవుతున్నా కూడా సోషల్ మీడియాలో ఆ సినిమా యొక్క హడావుడి మాత్రం తగ్గడం లేదు. దేశం కాని దేశంలో... కనీసం తెలుగు సినిమా అనేది ఒకటి ఉంటుందని తెలియని వారు కూడా ఇప్పుడు పుష్ప సినిమా లోని తగ్గేదే లే మ్యానరిజంను అనుసరిస్తున్నారు.

ముఖ్యంగా క్రికెటర్స్ పదుల సంఖ్యలో పుష్ప తగ్గేదే లే మ్యానరిజంతో అదరగొట్టారు. కేవలం క్రికెటర్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్స్ ఇంకా ఇతర క్రీడలకు సంబంధించిన వారు కూడా తగ్గేదే లే అన్న విషయం తెల్సిందే.

ఆ వీడియో లను అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో షేర్ చేయడం చేశారు. కాస్త సైలెంట్ అయ్యింది అనుకుంటూ ఉండగా మళ్లీ సందడి షురూ అవుతూనే ఉంది.

తాజాగా అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను అంతర్జాతీయ మహిళ క్రికెటర్ ఒకరు అనుకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ మహిళ క్రికెటర్ వికెట్ తీసిన ఆనందంలో వెంటనే తగ్గేదే లే అంటూ గదమ కింద చేయి పోనిచ్చి బన్నీ స్టైల్ లో యాటిట్యూడ్ చూపించింది. ఆమె అలా చేయగానే డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆమె సహచర మహిళ క్రికెటర్స్ కూడా చాలా మంది అదే చేశారు.

మొత్తానికి పుష్ప తగ్గేదే డైలాగ్ మరియు శ్రీవల్ల హుక్ స్టెప్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు. క్రికెటర్ లు అంత భారీగా పుష్ప సినిమా ను ప్రమోట్ చేయడం వల్లే ఇప్పుడు పుష్ప 2  కు ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం దర్శకుడు సుకుమార్ ఇంకాస్త కష్టపడాల్సి వస్తుందట.

పార్ట్ 2 పై ఉన్న అంచనాల నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు. సాదారణంగా అయితే ఫిబ్రవరి రెండవ వారంలోనే షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. కాని ఇప్పుడు మే వచ్చినా కూడా సినిమా సీక్వెల్ ను చేయడం లేదు. జూన్ నుండి ఈ సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.

Scroll to Top