వీడియో : అమెరికన్ వీధుల్లో ‘పుష్ప శ్రీవల్లి’ సందడి

BY T20,

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి ఘన విజయంకు ఆ సినిమాలోని పాటలు ప్రధాన కారనం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పుష్ప సినిమాలోని దాదాపు అన్ని పాటలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని పాటలు అయితే జాతీయ స్థాయిలో కొన్ని పాటలు అంతర్జాతీయ స్థాయిలో సైతం ఫుల్ ఫేమస్ అయ్యాయి.

శ్రీవల్లి పాట అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంది ప్రముఖుల సోషల్ మీడియా పేజీల్లో సందడి చేసింది. అంతటి ఫేమస్ అయిన పాటను కరోలినా ప్రోట్సెంకో అనే చిన్నారి అమెరికన్ రోడ్ల పై తన వయోలిన్ తో పాడి అందరి దృష్టిని ఆకర్షించారు. రోడ్ల పై ఇలాంటి ప్రదర్శణలు అమెరికాలో చాలా జరుగుతూ ఉంటారు. రద్దీ ప్రాంతాల్లో మరియు షాపింగ్ మాల్స్ వద్ద కూడా ఇలా తమ ప్రతిభ కనబర్చుతూ ఉంటారు.

కరోలినా ప్రోట్సెంకో అమెరికా కాలిఫోర్నియాలోని సిమి వ్యాలీ అనే చిన్న పట్టణంకు చెందిన అమ్మాయి. ఈమె కు యూట్యూబ్ లో ఏకంగా ఏడు మిలియన్ ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి పాట కూడా లక్షల్లో మరియు మిలియన్ లో ఫాలోవర్స్ ఉంటారు. ఈమె గురించి సోషల్ మీడియాలో తరచు చర్చ జరుగుతూ ఉంటుంది.

తాజాగా ఈమె శ్రీవల్లి పాటను తన వయోలిన్ తో ఈ పాప వాయించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వయోలియన్ పాప పుష్ప సినిమా స్థాయిని మరింతగా పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే హద్దులు దాటిన మన శ్రీవల్లి పాట ఈ పాప వవయోలియన్ తో మరింతగా ఫేమస్ అయ్యింది.

సూపర్ హిట్ అయిన పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది. షూటింగ్ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. పుష్ప 1 కు ఏమాత్రం తగ్గకుండా పుష్ప పార్ట్ 2 మ్యూజిక్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అందుకు తగ్గట్లుగానే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటి నుండే కసరత్తు మొదలు పెట్టినట్లుగా సుకుమార్ టీమ్ నుండి సమాచారం అందుతోంది.

Scroll to Top