ఇకపై డబ్బులు కడితేనే ‘టెలిగ్రామ్’! అదే దారిలో వాట్సాప్?

BY T20,

telegram premium account: టెలిగ్రామ్ యాప్​ ప్రీమియం వెర్షన్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫీచర్లను ప్రీమియం పరిధిలోకి తీసుకురానున్నట్లు సమాచారం.

టెలిగ్రామ్ ప్రయోగం సక్సెక్ అయితే వాట్సాప్ సైతం అదే బాటలోకి వెళ్లే అవకాశముంది.

telegram premium features: ఆధునిక మెసేజింగ్ ప్రపంచంలో వాట్సాప్, టెలిగ్రామ్ అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఆదరణ సంపాదించుకున్నాయి ఈ రెండు యాప్స్. ఉచితంగా సేవలు అందించడం వల్ల ఈ యాప్స్​ను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఆ ఫలితంగానే వీటికి అంత క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు టెలిగ్రామ్ రూటు మారుస్తోంది. ప్రీమియం వెర్షన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్లన్నీ ఉచితంగానే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా మరికొన్ని అధునాతన ఫీచర్లు తీసుకొచ్చి వాటికి సబ్​స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేయనుందని సమాచారం. ఈ పద్ధతి విజయవంతమైతే వాట్సాప్ సైతం ఇదే దారిలో వెళ్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

telegram premium price: ప్రస్తుతం టెలిగ్రామ్ ఐఓఎస్ బీటా వెర్షన్ (8.7.2) విడుదలైంది. ఇందులో కొత్తకొత్త ఎమోజీలు, రియాక్షన్స్, స్టిక్కర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రీమియం వెర్షన్​లోనివేనని టాక్ వినిపిస్తోంది. వీటిని ఉపయోగించాలంటే టెలిగ్రామ్ ప్రీమియం సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ లాగిన్ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​లో ప్రీమియంకు సంబంధించిన కొత్త ఫీచర్లు రాలేదు. ఎప్పుడు వస్తుందనే విషయంపైనా స్పష్టత లేదు. అయితే, ప్రీమియం వెర్షన్​కు ఛార్జీలు తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది.

whatsapp vs telegram: మెసేజింగ్ యాప్​ల విషయంలో వాట్సాప్, టెలిగ్రామ్ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఫంక్షనాలిటీ, ఫీచర్స్ విషయంలో టెలిగ్రామ్​.. వాట్సాప్​కు అందనంత ఎత్తులో ఉంది. అయితే, సులువుగా ఉపయోగించుకునే వీలున్న వాట్సాప్ మార్కెట్​లో లీడింగ్​ మెసేజింగ్ యాప్​గా కొనసాగుతోంది. అయితే, టెలిగ్రామ్ ప్రీమియం ఫీచర్ విజయవంతమైతే.. వాట్సాప్ సైతం సబ్​స్క్రిప్షన్​ల విషయంపై ఆలోచన చేసే అవకాశం ఉందని సమాచారం.

Whatsapp multi device: ఇక కీలకమైన అప్డేట్స్​ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ వేగంగా పనిచేస్తోంది. మల్టీ డివైజ్ ఫీచర్​ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్​లో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, వాట్సాప్ స్టేటస్​లకు ఎమోజీల ద్వారా రిప్లై ఇచ్చేలా కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ డెస్క్​టాప్ బీటా వెర్షన్​లో ఇది కనిపిస్తోంది. ఇవి అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టొచ్చు.

twitter circle friends:మరోవైపు, ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ట్వీట్లు కనిపించేలా చేసేందుకు ట్విట్టర్​లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి రానుంది. 'ట్విట్టర్ సర్కిల్' పేరుతో ఈ ఫీచర్​పై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తోంది సంస్థ. ఈ ఆప్షన్​తో 150 మంది వరకు ట్విట్టర్ యూజర్లను ఎంపిక చేసుకొని.. వారికి మాత్రమే ట్వీట్లు కనిపించేలా చేయొచ్చు. ఈ ఫీచర్​ను కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ట్విట్టర్ సేఫ్టీ ప్రకటించింది.

Scroll to Top