అద్దం ఎప్పుడు కనుగొన్నారు? తొలిసారి అద్దంలో ఎవరు ముఖం చూసుకున్నారంటే..

BY T20,

అద్దం లేకపోతే ఏమై ఉండేదని ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో అద్దం చాలా ముఖ్యమైనదని మనందరికీ తెలిసిందే. ఈ అద్దం మనం ఎలా చూస్తున్నామో, ఎలా కనిపించాలో, మనల్ని మనం ఎలా అందంగా మలచుకోవాలో మనకి నేర్పుతుంది.

ఇప్పుడు అద్దం ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. గ్లాస్ అనేదానిని 1835లో కనిపెట్టారని మనలో చాలామందికి తెలుసు. జర్మన్ రసాయన శాస్త్రవేత్త జస్టస్ వాన్ లీబిగ్.. గాజు పేన్ ఉపరితలంపై లోహపు వెండి యొక్క పలుచని పొరను అప్లయ్ చేసే పద్ధతిని కనుగొన్నాడు. దీనికి ముందు అద్దం వాడుకలో లేదు. ముఖ్యంగా పేదల దరికి అద్దం చేరలేదు. అప్పట్లో ప్రజలు తమ ముఖాన్ని నీటిలోనే చూసుకునేవారు. అప్పట్లో ఇంట్లో అద్దం పెట్టుకోవడం ఎంతో విలాసంతో కూడుకున్నది. చాలా అరుదుగా ఉండే తొలినాటి అద్దాలు పాలిష్ చేసిన అబ్సిడియన్‌తో తయారు చేశారు.

మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం అటువంటి అద్దాలు 8,000 సంవత్సరాల క్రితం అనటోలియాలో ఉపయోగించారు. దీనిని ఇప్పుడు టర్కీ అని పిలుస్తారు. పురాతన మెక్సికో ప్రజలు కూడా ఈ పద్ధతిని ఉపయోగించారు. అయితే ఆ రోజుల్లో అద్దాలు దేవతల ప్రపంచాన్ని, వారి పూర్వీకులను చూడగలిగే మాంత్రిక సాధనాలుగా పేర్కొనేవారు. రాగిని పాలిష్ చేయడం ద్వారా తయారు చేసిన అద్దాలు దాదాపు 4000 నుండి 3000 BC ఈజిప్టులో అలాగే మెసొపొటేమియాలో (ప్రస్తుతం ఇరాక్) కనిపించాయి. సుమారు 1,000 సంవత్సరాల తరువాత, దక్షిణ అమెరికాలో పాలిష్ చేసిన రాయితో గాజు తయారయ్యింది. 1వ శతాబ్దం ADలో, రోమన్ రచయిత ప్లినీ ది ఎల్డర్ గాజు అద్దాల గురించి ప్రస్తావించాడు. అయితే అవి నేటి అద్దాల మాదిరిగా ప్రతిబింబింబాన్ని చూపలేదు. చిత్రాలు స్పష్టంగా కనిపించలేదు. పైగా ఆ అద్దాలు చాలా చిన్నవిగా ఉండేవి.

Scroll to Top