BY T20,
ఓ మహిళ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. మ్యాన్‌హోల్ కనిపించకుండా ఉండటానికి అక్కడ వర్షాలు కూడా ఏమీ పడలేదు. కేవలం ఫోన్లో మునిగిపోయిన మహిళ ఎదురుగా ఉన్న మ్యాన్‌హోల్ చూసుకోలేదంతే. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ ఓ ఆటోరిక్షా వెనకాలే నడుచుకుంటూ వెళుతోంది. ఆటో మ్యాన్ హోల్ పైనుంచి వెళ్లి పోయింది. అంతే ఆటో వెనకాలే నడుస్తున్న మహిళ మాత్రం మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. దాంతో చుట్టుపక్కల వారు వెంటనే వచ్చి ఆమెను రక్షించారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కోట్టేస్తోంది. కొందరు ఆమె సురక్షితంగా ఉన్నందుకు ఆనందిస్తుంటే కొందరు మాత్రం ఫోన్ మాట్లాడుతుంటే ఎదురేముందో ఆ మాత్రం చూసుకోవా అంటూ ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. మరికొందరైనే నడిరడ్డులో నడుస్తున్నావ్, మ్యాన్‌హోల్ పడిన వెంటనే వెనకనుండి ఏదైన వాహనం వస్తే ఏంటి పరిస్థితి అంటూ భయపెట్టేస్తున్నారు. అయితే ఆ మ్యాన్‌హోల్ కేవలం ఏడడుగు లోతు మాత్రమే ఉండటంతో ఆమెను స్థానికులు రక్షించగలిగారు. ఇదిలా ఉంటే 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఇదే తరహాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా మ్యాన్ హోల్లో పడిపోయే సీన్ మనందరికీ తెలిసిందే.